హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతున్నదని మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. 5నుంచి 7వరకు లండన్లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మారెట్(డబ్ల్యూటీఎం)లో మంత్రి పాల్గొంటారని తెలిపారు. రా ష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ సంపదను వివరించేలా పర్యాట క శాఖ ఒక స్టాల్ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
ఆయా దేశాల పర్యాటక శాఖల మంత్రులు, విదేశీ ప్రతినిధు లు, గ్లోబల్ టూరిజం బోర్డులు, హో టళ్ల యజమానులు, ప్రయాణ, ఆతిథ్యరంగ నిపుణలతో మంత్రి చర్చలు జరుపనున్నారని వెల్లడించారు. లండన్లోని కాసిల్ గ్రీన్ లో నిర్వహించే తెలంగాణ పర్యాటక రోడ్ షోలోనూ పాల్గొంటారని వివరించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, 100కుపైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.