శనివారం 04 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 11:05:12

తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో నెలరోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దవాఖానలు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని పేర్కొంది.  


logo