ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 12:54:50

వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం కోసం స్థల పరిశీలన

వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం కోసం స్థల పరిశీలన

వనపర్తి : జిల్లాలోని పెద్దమందండి మండలం వీరాయి పల్లి గ్రామంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు పర్యటించారు. వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రానికి స్థలాన్ని పరిశీలన చేశారు. వీరాయిపల్లిలో 21 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్ రావు మాట్లాడుతూ..నూనె శాతం ఎక్కువగా ఉన్న వేరుశనగను పడించేందుకు విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.logo