తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష
తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్ఎస్ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు.
- కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి
- అబద్ధాలతో మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
దేవరుప్పుల, మే 8: తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్ఎస్ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమనేత కేసీఆర్ పోరాటంతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల పాలనలో హామీలను నెరవేర్చలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసగించేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మనకు కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగు, తాగునీటి సమస్యలతోపాటు కరెంట్ కోతలు నెలకొని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని .. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
దేవరుప్పుల నుంచి భారీ మెజార్టీ ఖాయం
ఒకప్పుడు ఎడారిని తలపించిన దేవరుప్పుల మండలంలో వాగులపై చెక్డ్యాములు నిర్మించడంతో పాటు దేవాదుల కాల్వ ద్వారా సాగనీరందించడం వల్ల సస్యశ్యామలమైందని ఎర్రబెల్లి తెలిపారు. 15 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ప్రజలంతా తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలోనే భారీ మెజార్టీ ఇక్కడి నుంచి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ బస్వ సావిత్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

