మంచిర్యాల, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 2,9వ వార్డుల్లో గురువారం రాత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామిని సమస్యలపై స్థానికులు నిలదీశారు. రెండేళ్లుగా తాగు నీటికి ఎంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, అర్హులైనవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.