శ్రీరాంపూర్, ఆగస్టు 24: లోన్‌యాప్ వేధింపులు ఓ యువకుడిని బలితీసుకున్నాయి. ఉరేసుకునే ముందు అతడు తీసిన సెల్ఫీ వీడియో కంటతడిపెట్టించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరునక్కనగర్లో చోటుచేసుకుం ది. అరునక్కనగర్లో నివసించే నమ్తాబాజి శ్రీకాంత్(29) తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేవాడు.
ప్రైవేట్ లోన్యాప్లో రూ. 5లక్షలు, ఫ్రెండ్స్, ఫైనాన్స్‌ల వద్ద రూ.10 లక్షల దాకా అప్పులు చేశాడు. ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెందినట్టు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆపై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.