హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): దారితప్పిన సమాజాన్ని గాడిలో పెట్టగల శక్తి సాహిత్య, సాంసృతిక రంగాలకే ఉన్నాయని సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ పేర్కొన్నారు. ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకోనున్న పీ లక్ష్మీనారాయణకు జరిగిన సతారసభలో ఆయన మాట్లాడారు. తెలుగు పరిరక్షణకు భాషా సాంసృతిక విధానాలు రూపొందించుకోవాలన్నారు. ఈ విషయంలో తమిళాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వెల్లడించారు.