హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు, సిద్ధాంతులు విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు జూబ్లీహిల్స్ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యత్ సభ బాధ్యులను సీఎం, మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, యాదాద్రి దేవస్థానం చైర్మన్ నర్సింహమూర్తి, ప్రధానార్చకుడు నర్సింహాచార్యులు, తెలంగాణ విద్వత్ సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి ఎంవీఆర్శర్మ, వేదంపండితులు నటరాజశర్మ, సాయిదీక్షిత్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రైల్వేశాఖ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యన్ సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రైల్వేలైన్‌పై చర్చించారు. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను వివరించారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా రూ.3,500 కోట్లతో 145 కిలోమీటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రైల్వేలైన్ రూట్‌మ్యాప్‌పై సీఎం పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వాకాటి శ్రీహరి, పర్ణికారెడ్డి పాల్గొన్నారు.