సిద్దిపేట టౌన్, మే 12 : ఎన్నికల కోసం వార్డులో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న బీజేపీ కార్యాలయంలో నిల్వ చేసిన మద్యాన్ని సిద్దిపేట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ లక్ష్మీబాబు, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని 39వ వార్డు గురుకృప కళాశాల వద్ద గల ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయంలో బీజేపీకి చెందిన నేతలు మద్యం నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేశారు. అందులో 4 కాటన్ల మద్యం లభించగా సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు రత్నం, శ్రీనివాసులు ఈ మద్యాన్ని తీసుకువచ్చినట్టు తెలుస్తున్నదని వన్‌టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు.