మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:09

‘చీప్‌' వైపు చూపు!

‘చీప్‌' వైపు చూపు!

  • కొవిడ్‌ ట్యాక్స్‌లతో పెరిగిన మద్యం ధరలు
  • చౌకమద్యం వైపు మందుబాబుల మొగ్గు
  • దేశవ్యాప్త సర్వేలోఆసక్తిర విషయాలు వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ ట్యాక్స్‌ల కారణంగా చాలా రాష్ర్టాల్లో మద్యం ధరలు చుక్కలనంటాయి. దీంతో మందుబాబులు చీప్‌ లిక్కర్‌వైపే మొగ్గుచూపుతున్నారు. 45 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అప్పటికే ప్రభుత్వ ఖజానాలకు రాబడి తగ్గింది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొవిడ్‌-19 పేరిట ప్రత్యేక సెస్‌ను అన్ని బ్రాండ్ల మద్యంపై ధరలు పెంచాయి. ఢిల్లీ, ఒడిషా, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో కరోనా సెస్‌ విధించారు. ఢిల్లీలో ఏకంగా 70 శాతం వరకు మద్యం ధరలు అదనంగా పెరగగా, ఒడిశాలో 50 శాతం, ఇతర రాష్ర్టాల్లో 40 శాతం వరకు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇదే సమయంలో మద్యం అమ్మకాలు, ఈ ఏడాది కొవిడ్‌ సెస్‌ తర్వాత అమ్మకాలు చూస్తే రూ.15 వేల కోట్లు అదనంగా ట్యాక్స్‌ రూపంలో వసూలైనట్టు సమాచారం. ఒక్కసారిగా మద్యం ధరలు పెరుగటంతో చీప్‌ బ్రాండ్లను కొనుక్కుంటున్నట్టు లోకల్‌ సర్కిళ్లు, కమ్యూనిటీ లెడ్‌ సోషల్‌ మీడియా ఎంగేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం సంస్థ సర్వేలో వెల్లడైంది. మొత్తం 7,800 మంది అభిప్రాయాలు  సేకరించగా ఆసక్తికర సమాధానాలొచ్చాయి.  
logo