హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వానలు పడుతాయని, ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.