హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతం ఒడిశా ( Odisha ) సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం ( Low-Pressure ) క్రమంగా బలపడుతుండడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ( Rains ) పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, పశ్చిమ దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రివేళల్లో అక్కడక్కడ చినుకులు పడవచ్చిని తెలియజేసింది.
హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ వివరించింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని , దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది.