బస్టాండ్‌లో పుట్టిన చిన్నారికి ఫ్రీ బస్‌పాస్
కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో జన్మించిన ఒడిశాకు చెందిన చిన్నారికి ఆర్టీసీ అధికారులు లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్ మంజూరు చేశారు. శనివారం ఆర్ఎం సుచరిత.. డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణతో కలిసి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లికి అందజేశారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 22: కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో జన్మించిన ఒడిశాకు చెందిన చిన్నారికి ఆర్టీసీ అధికారులు లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్ మంజూరు చేశారు. శనివారం ఆర్ఎం సుచరిత.. డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణతో కలిసి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లికి అందజేశారు.
ఈ నెల 16న ఒడిశా రాష్ర్టానికి చెందిన కుమారి భర్త దులాతో కలిసి డెలివరీ కోసం సొంతూరికి వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా కుమారికి పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన బస్టాండ్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పురుడు పోయగా పాపకు జన్మనిచ్చింది. పురుడు పోసిన సిబ్బందిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించి.. చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్సు పాసు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లికి ఆర్ఎం సుచరిత బస్‌పాస్‌తోపాటు రూ.14 వేల నగదు, నూతన వస్ర్తాలను అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

