NIMS MHM | ఖైరతాబాద్, జూలై 21: లక్షల్లో వేతనం.. గౌరవప్రద జీవితం కావాలనుకొనే కలను మాస్టర్స్ ఇన్ హా స్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుతో సా కారం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన నిమ్స్.. ఈ కోర్సును అందిస్తున్నది. బీటెక్, ఎం టెక్, ఎంబీబీఎస్ చదివినవారు కూడా ఈ కోర్సులో చేరారంటే దీనికున్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ లక్ష ల్లో సంపాదిస్తున్నారు.
రెండున్నరేండ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సును పూర్తి చేసిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని నిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభా గం హెచ్‌వోడీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కోర్సు అకడమిక్ ఇన్చార్జి డాక్టర్ మార్త రమేశ్ తెలిపారు. శుక్రవారం నిమ్స్ దవాఖానలో వారు మీడియాకు కోర్సు వివరాలను వెల్లడించారు. దేశంలోనే ఎంహెచ్ఎం కోర్సు అందిస్తున్న వైద్య విద్యా సంస్థ ఒక్క నిమ్స్ మాత్రమేనని తెలిపారు. నిమ్స్ ఎంహెచ్ఎం కోర్సు 19 ఏండ్లు పూర్తి చేసుకొన్నదని, వందలాది మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని వివరించారు. ఈ 20వ సంవత్సరం 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో, 9 వరకు దరఖాస్తులను నేరుగా అందజేయాలని సూచించారు.
అర్హతలివి
ఎంహెచ్ఎం కోర్సులో చేరేందుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి.. 2021 డిసెంబర్ 31 నాటికి 30 ఏండ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వారికి మూడేండ్ల సడలింపు ఉంటుంది. ఆయా అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్
రాష్ట్రంలో వైద్యరంగానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని సత్యనారాయణ, రమేశ్ కొనియాడారు. ఈ నేపథ్యంలో కోర్సులో చేరిన అర్హులైన వారికి వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్, టీఎస్ఆర్టీసీలో ఇతర విద్యార్థుల మాదిరిగా బస్‌పాస్ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. వివరాలకు www.nims.edu.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
అద్భుత అవకాశాలు
హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిన తరుణంలో ఈ కోర్సు చేసిన వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని సత్యనారాయణ, రమేశ్ తెలిపారు. ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, హెల్త్‌కేర్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ట్రాన్సికిప్షన్, మెడికల్ కోడింగ్ లాంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.