హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూవివాదంపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం(ఏఐఓబీసీఎస్ఏ) జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. 2324.5 ఎకరాల భూమిని యూనివర్సిటీకి బదలాయించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కోరారు.
హెచ్‌సీయూ భూముల పరిక్షణ పోరాటానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విద్యార్థులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.