హైదరాబాద్ : బీసీల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యపై కొందరు కుట్రపూరితంగా విష ప్రచారాలను చేస్తున్నారని, వాటిని తిప్పి కొడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు అన్నారు. నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడారు. కొన్ని శక్తులు కృష్ణయ్యపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తమ వైఖరిని మార్పుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, దాన కర్ణాచారి, ఉదయ్, నీలం వెంకటేశ్, నర్సింహాగౌడ్, సుధాకర్, జిల్లపల్లి అంజి, గొరిగె మల్లేశ్‌యాదవ్, అనంతయ్య, గుండేటి శంకర్, పగిల్ల సతీశ్, రాజేందర్, బర్క కృష్ణ, మధుసూదన్, వెంకన్న, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.