కరోనాను స్వీయ నియంత్రణతో అరికడుదాం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో కరోనాని అరికడదామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ రూరల్ : ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో కరోనాని అరికడదామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనాపై ఉన్న భయాన్ని పోగొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. గ్రామాలలో పారిశుధ్య పనుల్లో జాప్యం చేయొద్దని తెలిపారు.
కచ్చితంగా గ్రామాలలో కరోనాపై ప్రభుత్వం నిబంధనలు పాటించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువగా భయంతోనే మరణిస్తున్నారు. అందుకే ప్రజల్లో ఉన్న అపోహల్ని పోగొట్టేలా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారుకరోనా సోకినా వారిలో ఇంట్లో ఉండే వసతిలేని వారు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు.
గ్రామాలలో పారిశుధ్యం లోపించకుండా చూసుకోవాల్సిన భాద్యత అధికారులదేనని అన్నారు. ప్రజలంతా కూడా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కోరారు.
సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, డీఎల్ పీఓ కల్పన, ఎంపిడిఓలు, ఎపిఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పైల్వాన్ పూర్లో వ్యక్తి దారుణ హత్య
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్‌కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

