హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : శ్రీకృష్ణ భగవానుడు చూపిన ధర్మమార్గంలో నడుద్దామని గవర్నర్ జిష్ణుదేశ్వర్మ పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సౌభ్రాతృత్వం, సామరస్యం వర్ధిల్లాలని భగవానుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా లచ్చిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో 65 సంఘాలు.. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డిని చైర్మన్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకున్నాయి.ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యం, పదోన్నతుల క్యాలెండర్, హౌసింగ్ పాలసీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు అశ్వత్థామరెడ్డి, నిర్మల, లక్ష్మిరెడ్డి, సంపత్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, కుమారస్వామి, మహిపాల్‌రెడ్డి, షౌకత్‌అలీ, శ్రీకాంత్, ఉపేందర్‌రావు, గోపాల్‌రెడ్డి, రామకృష్ణ, రాములు, రమేశ్, పూల్‌సింగ్‌చౌహాన్, హరికిషన్, తిరుపతినాయక్, జనార్దన్, మేడి రమేశ్, దేవికా రొకం, మమత, వాణి, సకుబాయి, కమలాకర్ పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
సికింద్రాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ విద్యార్థి జేఏసీ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీహరి, లోకేశ్ , చరణ్‌కౌశిక్, శ్రీధర్, దరువు ఎల్లయ్య, వరంగల్ రవి, కోట శ్రీనివాస్, దుర్గం భాసర్, మందాల భాసర్, కృష్ణకాంత్, సురేష్, రెడ్డి శ్రీనివాస్, రవి, వంశీ, సురేష్, కృష్ణ పాల్గొన్నారు.