నారాయణపేట : నారాయణపేట జిల్లా(Narayanapet)మద్దూరు మండలం జాదవరావు పల్లి గ్రామ సమీపంలోని తాటి గుట్టపై చిరుత పులి(Leopard died) అనుమానాస్పదంగా(suspicious condition) మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూరు మండలంలోని జాదరావుపల్లి తాటిగట్టు గుట్ట సమీపంలోని చెరువులో నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఏదైనా జంతువు దాడి చేసి ఉండవచ్చు అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత మృతిపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.