హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర న్యాయ అధికార సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన అగ్రి, పారా లీగల్ వలంటీర్ల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. వలంటీర్లకు వాల్టా, వినియోగదారుల, విత్తనాలు, పంట బీమా, రెవెన్యూ, భూమి, నీటి వనరుల చట్టాలపై అవగాహన కల్పించారు. పారా లీగల్ వలంటీర్లకు సమాచార నైపుణ్యాల గురించి వివరించారు. వాలంటీర్లు అడిగిన సందేహాలను ఎల్ఏఎఫ్ఎస్ సంస్థ చైర్మన్ సునీల్ నివృత్తి చేశారు. రాష్ట్ర న్యాయాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్‌రెడ్డి వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. నల్సార్ వర్సిటీ వీసీ కృష్ణదేవరావు వందన సమర్పణ చేశారు.