బషీర్‌బాగ్ పోరాట ఫలితమే ఉచిత కరెంట్
బషీర్‌బాగ్ విద్యుత్తు పోరాట ఫలితంగానే ప్రస్తుతం రైతులకు ఉచిత కరెంటు పథకం అమలవుతున్నదని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. విద్యుత్తు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.
- కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంసరణల చట్టాన్ని వెంటనే వెనకి తీసుకోవాలి
- విద్యుత్తు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో వామపక్ష పార్టీల నేతలు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : బషీర్‌బాగ్ విద్యుత్తు పోరాట ఫలితంగానే ప్రస్తుతం రైతులకు ఉచిత కరెంటు పథకం అమలవుతున్నదని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. విద్యుత్తు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రం విద్యుత్తు సంసరణల పేరుతో కార్పొరేట్ శక్తులకు విద్యుత్తు రంగాన్ని అప్పజెప్పి కోట్లాది రూపాయలు ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు.
రైతుల మోటర్లకు మీటర్లు బిగించి నెలనెలా డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. 26 ఏండ్ల క్రితం చంద్రబాబు విద్యుత్తు చార్జీలు పెంచడం మూలంగా లక్షలాది మంది ప్రజలు తమ నిరసనగళాన్ని వినిపించారని, వారిపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పటికీ మొకవోని ధైర్యంతో కదం తొక్కినట్టు గుర్తుచేశారు. కేంద్రం ఒకవైపు పెట్రో పెంచుతూ, మరోవైపు విద్యుత్తు సంసరణల పేరుతో మరింత భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నదని, వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు ఝాన్సీ, హన్మేశ్, చంద్రశేఖర్, సుధాకర్, తేజ, షేక్షావలి, వీఎస్ బోస్, స్టాలిన్, పల్లె నర్సింహ, శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, బొడ్డుపల్లి కిషన్, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

