హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కళాశాలల్లో పలు అధ్యాపక పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు.
అగ్రానమీ 2, లైవ్‌స్టాక్, యానిమల్ హస్బెండరీ 2, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ 2, ఎంటమాలజీ 2, అగ్రికల్చర్ ఎకనామిక్స్ 2, ప్లాంట్ పాథాలజీ 2, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. ఎమ్మెస్సీ అగ్రికల్చర్, పీహెచ్డీ చేసిన మహిళా అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గలవారు ఈ నెల 13లోగా రెస్యూమ్, అకడమిక్ ప్రొఫైల్‌ను mjpkrnagbsc2022@ gmail.comకు మెయిల్ చేయాలని, దరఖాస్తు చేసుకున్న వారికి డెమో/ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు 76809 41504నంబర్లో సంప్రదించాలని సూచించారు.