హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలను కలుసుకొంటూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. గులాబీ కండువాను కప్పుకొంటున్నారు. బుధవారం యావత్మల్ జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు, రైతు సంఘటన్ నేతలు బీఆర్ఎస్లో చేరారు.
ఇటీవల బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు శంకరన్న దోండ్గేను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్లో కలిసి పనిచేస్తామని ముందుకొచ్చారు. పార్టీలో చేరిన వారిలో దీపక్ కొమెల్వార్, రోహన్ రామ్టెకే, జ్యోతితాయి, యోగితా తాయి కోపెల్వార్ తదితరులు ఉన్నారు.