హైదరాబాద్ : జీవో 29(G.O.29) రద్దు కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు జీవో 29 రద్దు కోసం బీఆర్ఎస్ పోరాడుతుండగా మరో వైపు బీసీ సంఘాలు కూడా ఈ విషయంపై ఉద్యమిస్తున్నాయి. తాజాగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు(BC Intellectual Forum) జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, కుందారం గణేష్ చారి, చెరుకు సుధాకర్,పల్లె రవి కుమార్ గౌడ్ తదితరులు రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ శర్మను(Governor Bishnudev Sharma) కలిశారు. బీసీలకు అన్యాయం చేసే జీవో నెంబర్ 29 రద్దుచేసి ఆ తర్వాతే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేలా చూడాలని కోరారు.
బీసీ నేతలకు అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్, జీఓ 29 ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. అగ్రవర్ణాలకు ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుంది. జీవో నెంబర్ 29 వల్ల రాష్ట్రం మొత్తం అన్యాయం జరుగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ప్రశ్నిస్తూ రోడ్లపైకి వచ్చిన వారిని కొడతారా? అని ప్రశ్నించారు. బీసీలను నాశనం చేసే జీవో 29 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.