హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారికి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకే బీఆర్ఎస్లో చేరామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తదితరులు ఉన్నారు.
రాళ్లపాడు, లింగాపూర్, చిన్నదాంపూర్, పిట్టగూడ, ఎల్లాపూర్ ఎల్లపటార్ సర్పంచులు అనుముల రాకేశ్, జాదవ్ రాజశేఖర్, పవార్ సులోచన, ఆడే సునీత, పవార్ బాబులాల్, రాళ్లపాడు, లింగాపూర్ ఉప సర్పంచులు రెబ్బెన సుధాకర్, నైతం ఛత్రు, లింగాపూర్ మాజీ జడ్పీటీసీ లఖ్యానాయక్ తదితరులు ఉన్నారు.
బిజినేపల్లి, మార్చి 29 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మేస్త్రీ సంఘ సభ్యులతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ చేరారు. వీరికి నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మేస్త్రీ సంఘ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీశైలం, రమేశ్, శివుడు, మధు, అంజి, బాలపీరు, శ్రీశైలం, నర్సింహ, శ్యామ్, కృష్ణయ్య, జంగయ్య, ఆంజనేయులు, భగవంతు, రాజు, పర్వతాలు, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.