అలంపూర్, జూన్ 16 : హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు పీ నారాయణ, శైలేష్పై దాడి ఘటనను నిరసిస్తూ సోమవారం అలంపూర్ సివిల్ కోర్టులో న్యాయవాధులు విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకూ దాడులు అధికమవుతున్నాయని, ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు.