కొండాపూర్, ఆగస్టు 29: పేగులకు సంబంధించిన వ్యాధులపై పరిశోధనల కోసం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) దవాఖానలో శనివారం ‘గట్ మైక్రోబయోమ్ థెరప్యూటిక్స్ అండ్ పిల్ ల్యాబ్’ను ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ లాంటి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)లపై ప్రధానంగా పరిశోధనలు చేపట్టనున్నామని, మైక్రోబయోమ్ క్యాప్సూల్స్‌ను అభివృద్ధి చేయనున్నప్పటికీ ప్రస్తుతం ఇవి పరిశోధన ప్రయోజనాలకే పరిమితమని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు కొత్త చికిత్సా మార్గాలను అన్వేషించేందుకు అవకాశం ఉందని తెలిపారు.