TGGENCO | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆదివారం పరీక్ష. అది ఉదయం 9గంటలకే.ఈ సమయంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా పరీక్షాకేంద్రాల మార్పు. ఒక సెంటర్‌కు బదులుగా మరో సెంటర్లో పరీక్ష. ఇది తెలంగాణ జెన్కో నిర్వహించే పరీక్షలో జరిగిన తంతు.
జెన్కో పరిధిలోని ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లనూ జారీచేశారు. సాంకేతిక కారణాలతో మూడు పరీక్షాకేంద్రాలను ఆకస్మికంగా మార్చారు.
కేపీఎం టెక్నాలజీ సొల్యూషన్స్‌కు చెందిన మూడు సెం టర్ల స్థానంలో బోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో రెండు షిప్టులు, ఎంవీఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో ఒక షిప్ట్ పరీక్షరాసేలా సెంటర్లు మార్చారు. దీంతో ఆయా పరీక్షాకేంద్రాల్లో హాజరుకావాల్సిన వారు ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు.