హైదరాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): వచ్చేనెల నుం చి భూముల రీ సర్వే ప్రారంభిస్తామని, భూ వివాదాలు లేని తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తొలి దశలో హైదరాబా ద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 70 గ్రామాల చొప్పున 2,240 గ్రామాల్లో సర్వే చేస్తామని తెలిపారు. శుక్రవారం రెవె న్యూ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు. నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించామని వెల్లడించారు. వీటిలోని 5 గ్రామాల్లో రీ సర్వే చేసి భూధార్ నంబ ర్లు కేటాయించామని స్పష్టం చేశారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ తదితర సాంకేతికతతో సర్వే చేస్తామని వెల్లడించారు. రీ సర్వే తర్వాత ప్రతి కమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక మ్యాపులు సిద్ధమవుతాయని చెప్పారు.