యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన నేడు.. నారసింహుడు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ఆయల మాడవీధుల్లో ఊరేగించారు. సోమవారం రాత్రి స్వామివారికి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. కాగా, గుట్టలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. ఉచిత దర్శనానికి గంటా 30 నిమిషాలు, రూ.150 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్నది.