యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు.
కుడిచేతిలో పిల్లనగ్రోవి, ఎడమచేతి చిటికెనవేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన స్వామివారిని పట్టుపీతాంబరాలతో అలంకరించి తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామివారు సింహవాహనంపై ఊరేగారు. శుక్రవారం రాత్రి స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు.