ఇచ్చోడ, ఆగస్టు 28: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామానికి చెందిన వంద మంది పింఛన్‌దారులు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్ల కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు. గ్రామంలోని వంద మంది పింఛన్‌దారులు తమ నెలవారి పింఛన్ నుంచి రూ.వెయ్యి చొప్పున జమ చేసి నామినేషన్‌కు అందజేసినట్టు సర్పంచ్ మీనాక్షి గాడ్గె తెలిపారు. తమకు పెద్ద దిక్కు కేసీఆర్ అని, తమకు ప్రతినెలా రూ.2 వేల పింఛన్ ఆయన దయతోనే వస్తున్నదని, తమవంతు సాయంగా రూ.లక్ష పోగుచేసి ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు
ఎన్నికల నామినేషన్ కోసం పింఛన్‌దారులు రూ.వెయ్యి చొప్పున పోగు చేసి రూ.లక్ష విరాళంగా ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణ యం తన హృదయాన్ని తాకిందని ప్రశంసించారు. ముక్రా(కే) పింఛన్‌దారుల ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.