హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ) : లగచర్ల రైతుల విషయంలో బేడీలు వేయాల్సింది రైతులకా? సీఎం రేవంత్రెడ్డికా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతులతో చర్చించకుండా ఫార్మా విలేజ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి భూములు లాక్కోవాలని చూశారని విమర్శించారు. వారు వారించినా వినకుండా పోలీసులతో దాడి చేయించారని, తీరా ఫార్మా విలేజ్‌ను రద్దు చేసుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరికి సంకెళ్లు వేయాలని నిలదీశారు. ఫార్మా విలేజ్‌ను రద్దు చేసుకున్న సర్కారు కేసులను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. బందిపోటు దొంగల మాదిరిగా గుండెపోటుకు గురైన రైతుకు బేడీలు వేసినతీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసిందని తెలిపారు.
తిరుమలాయపాలెం, డిసెంబర్ 13 : ‘కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నింపేందుకు బస్తాలు లేవు. మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాకు మూడు కేజీల చొప్పున కోత పెడుతున్నారు. ధాన్యం కాంటాల్లోనూ ఆలస్యం జరుగుతోంది’ అంటూ గోల్‌తండా, గో పాయిగూడెం, పాతర్లపాడు, హైదర్‌సాయిపేట, కొక్కెరేణికి చెందిన రైతు లు తమ ఆవేదనను ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొ క్కెరేణికి వచ్చిన రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి దృష్టికి శుక్రవారం తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. కలెక్టర్, అదనపు కలెక్టర్ అక్కడ లేకపోవడంతో తన ప్రోగ్రాం లో ఇద్దరూ తప్పకుండా ఉండాలని ఆదేశించా రు. ఈ క్రమంలోనే అక్కడున్న అధికారులపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని, తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్న మిల్లు యాజమాన్యంపై విచారణ జరిపి, సీజ్ చేయాలని ఆర్డీవో నర్సింహారావు, మండల ప్రత్యేకాధికారి రమేశ్‌ను ఆదేశించారు.