హైదరాబాద్, జూలై 24: జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి ఎడుగుళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని.. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్ల జీవించాలని ఆయన ఆకాంక్షించారు.