ఆదివారం 31 మే 2020
Telangana - Apr 30, 2020 , 19:10:39

కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ

కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌ : కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లేఖలో ఐటీ రంగంలోని సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలను కేంద్రమే ఆదుకోవాలన్నారు. కేంద్ర వద్ద పెండింగ్‌ ఉన్న జీఎస్‌టీ, ఆదాయపన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఐటీ ఎంఎస్‌ఎంఈలకు స్వల్పకాలిక రుణాలిచ్చి లే ఆఫ్స్‌ ఆపవచ్చన్నారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు స్టాండర్డ్‌ హెల్త్‌ కోడ్‌ ప్రవేశపెట్టాలన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేలా నిర్దేశించాలని పేర్కొన్నారు.


logo