సిరిసిల్ల జేఎన్టీయూ సమస్యలపై దృష్టిపెట్టండి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
- వెంటనే కొత్త క్యాంపస్‌ను నిర్మించండి
- 20021లోనే రూ.402 కోట్లతో పరిపాలనా అనుమతులొచ్చాయి
- అప్పటిదాకా ప్రస్తుత క్యాంపస్‌లోనే కొనసాగించండి
- సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నదని ఆదివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమి కేటాయించామని పేర్కొన్నారు. నిర్మాణ పనులు ప్రారంభంకాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతున్నదని తెలిపారు.
ప్రైవేట్ భవనంలోకి తరలించొద్దు
కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేట్ భవనానికి తరలించే ప్రతిపాదనల వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలను నిరుపయోగం కాకుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.
తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కళాశాల ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు చుట్టుపకల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిషరించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

