KTR | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( KTR ) చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇవాళ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. సమ్‌థింగ్ టు థింక్ అబౌట్ అంటూ రాసుకొచ్చారు. మరి ఆ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటంటే.. మీరు చెత్తను( Garbage ) వీధుల్లో పడేస్తే.. దాన్ని అంతిమంగా తీసేందుకు ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్( Uneducated Person ) కావాలి.. దయచేసి చెత్తను డస్ట్ బిన్స్‌లో వేయండి అని రాసి ఉంది. చెత్తను ఏరుతున్న ఓ బాలిక ఫోటోను కూడా ఆ బోర్డులో ఏర్పాటు చేశారు.
అంటే చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకుండా, చెత్త డబ్బాల్లోనే వేయాలని ఆ ఫోటోలో ఉన్న పరమార్థం. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డును కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతోంది.
Something to think about 👇 pic.twitter.com/NZd7zB79xx
— KTR (@KTRBRS) March 17, 2023