సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కోసం ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి
అక్టోబర్ 1 నుంచి రాయితీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే గృహ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇప్పటికే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులు ఇకపై ఎటువంటి చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి మొత్తం దేశీయ ఎల్పీజీ వినియోదారులలో 89.9 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది తమ బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేసుకున్నారు.
- అక్టోబర్ 1 వరకు గడువు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అక్టోబర్ 1 నుంచి రాయితీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే గృహ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇప్పటికే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులు ఇకపై ఎటువంటి చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి మొత్తం దేశీయ ఎల్పీజీ వినియోదారులలో 89.9 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది తమ బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేసుకున్నారు.
ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారికి ధ్రువీకరణ పూర్త్తయన తర్వాత రాయితీతో కూడిన రీఫిల్ బుకింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాయితీతో కూడిన గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు మళ్లించడాన్ని నివారించడం, నకిలీ, అనైర్హమైన కనెక్షన్లను తొలగించడం ఈ చర్య వెనుక ఉన్న లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులు ఎల్పీజీ సరఫరా సమయంలో తమ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లో లేదా ప్రభుత్వ రంగంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల మొబైల్ అప్లికేషన్ల ద్వారా అంటే ఇండేన్ కోసం ఇండియన్ ఆయిల్ ఒన్, భారత్‌గ్యాస్ కోసం హెల్లోబీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే ద్వారా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయడానికి ఇష్టపడని లేదా పూర్తి చేయలేని వారు కూడా ఎల్పీజీని పొందగలరు. అయితే వారికి సబ్సిడీ లేకుండా వర్తించే మార్కెట్ ధరకే అది లభిస్తుంది. అటువంటి వినియోగదారులు వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, వాట్సాప్ చాట్బాట్లు, ఐవీఆర్ఎస్ వంటి ఓఎంసీల డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ ఎంపికను నమోదు చేసుకోవలసి ఉంటుంది. స్థానిక లభ్యతను బట్టి వారు 5 కిలోల లేదా 10 కిలోల సిలిండర్లను పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

