KTR | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తండ్రిపై కండ్లెదుటే పాశవికంగా దాడి జరుగుతుంటే చూడలేక సాయం కోసం రోదించి 14 ఏళ్ల పావని చనిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా ఢీ కొత్తపల్లిలో భూతగదాలతో సోమయ్య అనే వ్యక్తిపై భార్య, కూతురు ముందే ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడ్డారని, తండ్రిని కాపాడుకునేందుకు పావని విలవించి సృహా తప్పి చనిపోయిందనే వార్త తెలిసినప్పటి నుంచి మనసంతా భారంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పావని కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘పావని నిన్ను కాపాడుకోలేకపోయినందుకు క్షమించు’ అని కేటీఆర్ ఆవేదన చెందారు.