హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 2న 11గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు. సెప్టెంబర్ 1న జరుగాల్సిన చార్జ్‌షీట్ కార్యక్రమం ఒక్కటే 2వ తేదీకి వాయిదా వేశామని, పార్టీ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మిగతా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని బీఆర్ఎస్ పార్టీ వర్గా లు స్పష్టంచేశాయి. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాం గ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీ లు, ప్రజలను మోసం చేసిన తీరుపై ధర్నాలు నిర్వహిస్తారు. బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది.