29న అలుగునూర్‌లో దీక్షాదివస్ సభ
కరీంనగర్‌లోని అలుగునూర్‌లో ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో కలిసి గంగుల క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 13 : కరీంనగర్‌లోని అలుగునూర్‌లో ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో కలిసి గంగుల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పారింగ్కు అనువైన స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఎంపిక మొదలుకొని పారిం గ్, ఇతర ఏర్పాట్ల వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, మానకొండూర్ మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- DeekshaDiwas
- Karimnagar
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

