హాస్టళ్ల మూసివేత దుర్మార్గం
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను బలవంతంగా ఇండ్లకు పంపించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుంటామని అధికారులను కోరిన విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి
ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు సంకెళ్లు సరికాదు
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
మీడియాతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 13 : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను బలవంతంగా ఇండ్లకు పంపించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుంటామని అధికారులను కోరిన విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్‌కు సంబంధించిన ఈ-1, ఈ-2, డీ-బ్లాక్ వసతి గృహాల్లో నీళ్లు, కరెంట్ సరఫరా నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాటాకుల చప్పుళ్లకు విద్యార్థులు భయపడరని, అక్కడి నుంచే అగ్గి రాజుకుంటుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్ ఆరు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అవసరమైతే ముఖ్యమంత్రినే మారుస్తామని అన్నారని, ఇప్పుడు రాహుల్ మాటను సీఎం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఏమిటో తెలియజేయాలని ప్రశ్నించారు.
సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక సదర్
సంస్కృతీసంప్రదాయాలకు సదర్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని టీడీ గుట్ట ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సదర్ నిదర్శనమని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

