సజ్జనార్.. యూనిఫామ్‌లో ఉన్న నేరస్తుడు!
ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉద్యోగం నుంచి బదిలీ చేయడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ఆయన కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉద్యోగం నుంచి బదిలీ చేయడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ యూనిఫామ్ వేసుకున్న నేరస్తుడని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. తన మాజీ సహచరుడిని ఇలా అభివర్ణించాల్సి రావడం ఎంతో బాధ కలిగిస్తున్నప్పటికీ వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నారు. వ్యక్తిగత అనుబంధాలు, సర్వీసు సహచరుల మధ్య స్నేహం కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.
సజ్జనార్‌ను సీపీ ఉద్యోగం నుంచి బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కేవలం సజ్జనార్ బదిలీతో సమస్య పరిషారం కాదని, ఆయన కార్యకలాపాలతోపాటు ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికారిని బదిలీ చేయడం శిక్ష కాదని, అంతమాత్రాన ఆయనపై ఉన్న నేరారోపణలు తొలగిపోవని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

