నేడు సింగరేణి గర్జన
అధికారంకోసం హామీలిచ్చి గద్దెనెక్కగానే మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్‌పై కదంతొక్కేందుకు సింగరేణి కార్మికలోకం సిద్ధమవుతున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ‘సింగరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తికాగా పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు నల్ల సూర్యులు ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు 30 వేల మంది పాల్గొంటారని భావిస్తున్న సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
- గోదావరిఖనిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కాంగ్రెస్ మోసాలపై కదం తొక్కనున్న కార్మికులు
గోదావరిఖని, అక్టోబర్ 13: అధికారంకోసం హామీలిచ్చి గద్దెనెక్కగానే మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్‌పై కదంతొక్కేందుకు సింగరేణి కార్మికలోకం సిద్ధమవుతున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ‘సింగరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తికాగా పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు నల్ల సూర్యులు ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు 30 వేల మంది పాల్గొంటారని భావిస్తున్న సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రెండు రోజులుగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు సభ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్‌రెడ్డి, కౌశిక హరి, కోలేటి దామోదర్, మూల విజయారెడ్డి సభ విజయవంతం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. సభకు రామగుండం, మంథని నియోజకవర్గాలతోపాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరానున్నారు.

6,324 కోట్లు ఏమైనయ్? : కొప్పుల
‘ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరిట రెండేండ్లుగా సింగరేణి లాభాల్లోంచి పక్కన పెట్టిన రూ.రూ.6,324 కోట్లు ఏమైనయి? ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలి’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. మంగళవారం గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్మికుల జీతాలు, సంక్షేమం కోసం ప్రతి నెలా రూ.4 వేల కోట్లు ఓడీ రూపంలో తెస్తున్నామని చెప్తు న్న ప్రభుత్వం, ఇంత పెద్ద మొత్తంలో నిల్వ లు ఉన్నా మళ్లీ ఓడీలు ఎందుకు తేవాల్సి వస్తున్నదని నిలదీశారు. ఇది కార్మికులను మోసం చేసే పెద్ద స్కామ్ అని, దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణి కార్మిక గర్జన నిర్వహిస్తున్నందునే ప్రభుత్వం దిగివచ్చి కేటీఆర్ సభకు ముందే మంగళవారం లాభాల వాటాను ప్రకటించిందని చెప్పారు.
సింగరేణిని భ్రష్టు పట్టించిండ్రు : బాల్క సుమన్
కాంగ్రెస్ సర్కార్ సింగరేణి సంస్థను భ్రష్టుపట్టించిందని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ విమర్శించారు. సోలార్ ప్లాంట్లు, డీజిల్, పెట్రోల్ కొనుగోళ్లు, ఓబీ వర్క్ టెండర్లు, ఎక్స్ప్లోజివ్ల కొనుగోళ్లలో విపరీతమైన కుంభకోణాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

