KTR | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్లకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడటం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడిచి కొట్లాడిన తీరు అద్భుతం అన్నారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమ కేసీఆర్‌పైన ఉన్న అచంచలమైన విశ్వాసంతో తమ పార్టీ కార్యకర్తలు తమ వాణిని బలంగా వినిపించి, అద్భుతంగా కొట్లాడారని కొనియాడారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.