హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవీదాస్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాలలో కన్నుమూశారు.
విషయం తెలిసి పూర్ణకు కేటీఆర్ ఫోన్‌చేసి మాట్లాడారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పి ఓదార్చారు. దేవీదాస్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. త్వరలో స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చారు.