హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్కు కేటీఆర్ అండగా నిలిచారు. గుండె ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించాలని వేడుకోగా ‘అంతా నేను చూసుకుంటా.. అధైర్య పడకు.. అండగా ఉంటా’నని భరోసా ఇచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబుయాదవ్తో కలిసి అమానుల్లాఖాన్ కేటీఆర్‌తో భేటీ అయ్యా రు. తన అనారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి, గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సిన దీన పరిస్థితిని వివరించారు. తక్షణమే స్పందించిన కేటీఆర్ ‘అన్నీ నేను చూసుకుంటా. ఆపరేషన్ చేయిస్తా. ధైర్య ంగా ఇంటికెళ్లు’ అని అభయమిచ్చారు. తనకు అండగా నిలిచిన కేటీఆర్‌కు అమానుల్లాఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.