KTR | తెలంగాణ అభివృద్ధి గాథను గ్లోబల్ వేదికపై పంచుకున్న కేటీఆర్
KTR | తెలంగాణ అభివృద్ధి గాథను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై పంచుకున్నారు. అమెరికా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర పురోగతిపై తన అనుభవాలను పంచుకున్నారు.

పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం పదేళ్లలోనే దేశానికి మార్గదర్శకంగా నిలచే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన వివరించారు.

Ktr2
ఈ కాన్ఫరెన్స్‌లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్ విధానాలపై లోతైన చర్చ జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, నిపుణులతో జరిగిన సంభాషణలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!