KTR | తెలంగాణ కరువులకు.. కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: కేటీఆర్
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు.
హైదరాబాద్: తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమని తెలిపారు. దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరమంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!. తలాపున గోదారి గలగల పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం!
సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం..! దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన
పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్‌కు పునరుజ్జీవమిచ్చిన పుణ్య వరం కాళేశ్వరం!. నీళ్లురాక.. ఒట్టిపోయిన నిజాంసాగర్‌కు నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం!. మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం.
మా తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం.
కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం సరిదిద్దుకోగలం. రాజకీయ కుళ్లు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం. మీ ఏడుపే మా ఎదుగుదల’
మా కరువులకు కన్నీళ్ల కు
శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు
గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు
ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన
మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్న
తనువంతా ఎడారై ఎండిన శాపానికి
విమోచనం కాళేశ్వరం!సముద్ర…
— KTR (@KTRBRS) July 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

