పాలకుర్తిరూరల్, జూలై 16 : జనగామ జిల్లా(Janagam Dist) పాలకుర్తి మండలంలో వావిలాల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కోలా శ్రీను(33) కుటుంబానికి(Kola Srinu family)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్(KTR) అండగా నిలించారు. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి వడ్లకొండ వినయ్ పెట్టిన పోస్టుకు కేటీఆర్ స్పందించి, ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటామన్నారు. కోలా శ్రీనుకు 12 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. ముగ్గురు ఆడ బిడ్డలు రక్షిత, రిషిత, రితిక జన్మించారు.
కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల శ్రీను అనారోగ్యానికి గురై గురువారం మృతి చెందాడు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండడంతో దహన సంస్కారాలు కూడా జరిపించలేక పరిస్థితి. దీంతో గ్రామస్తులు విరాళాలు సేకరించి దహన సంస్కారాలు జరిపించారు. ఈ విషయాన్ని ఎక్స్ మాధ్యమం ద్వారా కేటీఆర్ దృష్టికి బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి వడ్లకొండ వినయ్ తీసుకెళ్లగా, ఆయన స్పందించారు. వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్కు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.